Listen to this article

జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ గడి పెద్దాపూర్ మెదక్ జిల్లా 27 /3 /2026 శుక్రవారం

అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవం దేదీప్యమానంగా సాగింది. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆదర్శమైన దివ్య వివాహ మహోత్సవము. క్షేత్ర శుద్ధ నవమి రోజున జరిగే ఈ వేడుక లక్ష్మీ నారాయణ కలయికగా భావిస్తారు, ఇది భార్యాభర్తల అనుబంధానికి ధర్మానికి, ప్రేమకు మరియు నిబంధనకు ప్రత్యేకగా నిలుస్తుంది. ఆణిముత్యాల వంటి తలంబ్రాలతో జరిగే ఈ వివాహం చూడటం వల్ల కుటుంబంలో ఆనందం,అన్యోన్యత మరియు సంతోషం కలుగుతాయని ప్రజల నమ్మకం. ఆలయ పూజారి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ సీతాదేవి భూమాత స్వరూపంగా, రాముడు సూర్యవంశయుడని వీరి వివాహం వలన భూమి సఫలవంతమై సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామ రసాన్ని ఆస్వాదిస్తూ, సీతారామ నామస్మరణతో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు, సాయంకాలం శ్రీ సీతారామచంద్ర గ్రామ పురవీధులలో పల్లకి సేవలో ఊరేగించడం జరుగుతుంది.