జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు, గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ దంపతులు అడ్వకేట్ లెక్కల జలంధర్ రెడ్డి లక్ష్మీ దంపతులు తలంబ్రాలు పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల మధ్య తమ తమ ఇండ్లలోనుండి తీసుకువచ్చి స్వామివారి కళ్యాణానికి అందజేసినారు. అనంతరం దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్య గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనము రక్షాబంధన పూజ వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించినారు. అనంతరం అడ్వకేట్ లెక్కల జలంధర్ రెడ్డి లక్ష్మీ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ సందర్భంగా సౌమిత్రి లక్ష్మణ చారి గారు ధార్మిక ఉపన్యాసం చేసినారు. ఉదయం దేవాలయం నుండి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై పరమేశ్వర దంపతులు ఉప సర్పంచ్ సుమన్ దిడ్డి రమేష్ ప్రభాకర్ గిద్దమారి సురేష్ కడారి చంద్రమౌళి మంత్రి రాజు తుమ్మ ప్రభాకర్ కొత్తపెల్లి శ్రీకాంత్ మోరి రంజిత్ ఉప్పు రాజు రమేష్ అబ్బు రాజు గంగుల కృష్ణారెడ్డి నీల రంగారెడ్డి కానుగుల నాగరాజు నరహరిశెట్టి రామకృష్ణ అనుకారి శివాజీ పల్లం ఆనంద్ అనుమాండ్ల రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు……



