Listen to this article

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం

మద్నూర్ మార్చ్ 28 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం మద్నూర్ మండలంలో పర్యటించారు. ముందుగా మండల కేంద్రం లోని బాయ్స్ హైస్కూల్ లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. స్కూల్ డిజైన్ మ్యాప్ పరిశీలించి 2027 సంవత్సరం డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని, నాణ్యతగా నిర్మాణాలు చేపట్టాలని విద్యార్థులకు సౌకర్యవంతంగా, జుక్కల్ నియోజక వర్గానికి ఒక రోల్ మోడల్ గా నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు.అక్కడి నుండి నేరుగా పెద్ద ఎక్లార గేట్ వద్ద గల రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. ముందుగా హాస్టల్ గేట్ వద్ద నిర్మించిన సెక్యూరిటీ గార్డ్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల మెస్ హాల్ లో విద్యార్థినుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్ వంట గది పరిశీలించి పరిశుభ్రత గా ఉంచుతూ, ఎప్పటికీ అప్పుడు తాజా కూరగాయలు ఉంచుతూ, వస్తువులను ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గతంలో హాస్టల్ సందర్శన సందర్భంగా మంజూరు చేసిన నిధులతో సెక్యూరిటీ గార్డ్ రూమ్, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, అదనంగా నీటి సౌకర్యం కల్పించుటకు నిధులతో పనులు పూర్తి అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ స్కూల్ కామారెడ్డి RCO, DEO, మండల స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపిడిఓ రాణి, ఎంఇఓ మరియు వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.