Listen to this article

జనం న్యూస్ మార్చ్ 28 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఎల్కతుర్తి మండలం లోని గోపాల్పూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న పశువుల సంత కు సోమవారం నాడు వేలంపాట ఉంటుందని సర్పంచ్ కర్రే లక్ష్మి బిక్షపతి గ్రామ కార్యదర్శి మిల్కూరీ గణపతి ఈ సందర్భంగా తెలిపారు వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ నిబంధనలను పాటిస్తూ పశువుల సంతను ఏర్పాటు చేస్తున్నామని వారు మీడియా ద్వారా వివరించారు పశువుల వారసంత బహిరంగ వేలంలో పాల్గొనే వారు తేది 30,03,2026 సోమవారం రోజున ఉదయం 11:00 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కలదు ఇట్టి వేలంలో పాల్గొనేవారు ఏ ప్రాంతం వారైనా 5000 ఐదు వెయ్యిలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు
వివరాలకు. సర్పంచ్ కర్రె.లక్ష్మీ బిక్షపతి..9959029055 కార్యదర్శి 94417 32773 సంప్రదించవచ్చని ఈ సందర్భంగా అన్నారు