జనం న్యూస్ మార్చి(28) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో
శనివారం నాడు నిర్వహించిన లోక్ అదాలత్ సాక్షిగా తుంగతుర్తి లోని జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎండి గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్ లో తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన దంపతులు వీరమల్లు, సరితలకు 2012 లో వ్యూహం జరిగింది. మనస్పర్దాలతో వేరువేరుగా ఉంటున్న వాళ్ళిద్దరూ ఒకటి కావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కేసులు వద్దు సామరస్యంగా పరిష్కారం ముద్దు అది లోక్ అదాలత్ తో సాధ్యపడుతుందని జడ్జి పేర్కొన్నారు. కక్షిదారులు శనికావేశాన్ని మరచి ప్రతి ఒక్కరూ ప్రేమ అభిమానాలతో జీవించాలని కోరారు. లోక్ అదాలత్ కు విశేష స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నరసింహారావు ఎస్సై క్రాంతికుమార్,చిరంజీవి, సైదులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనపర్తి జ్ఞాన సుందర్,కారింగుల వెంకటేశ్వర్లు,ఫర్వీన్ బేగం రాజు,వేణు యాదవ్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.


