Listen to this article

జనం న్యూస్ మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అమలాపురం పార్లమెంట్ జిల్లా కమిటీ సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన అమలాపురంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి గంధం పళ్ళoరాజు నివాసంలో జరిగింది.అమలాపురం పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన నిర్ణయాలు చర్యలు కోసం జిల్లా కమిటీ సభ్యులు చర్చించారు.ఆదివారం జరగనున్న తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవo కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులందరూ తమ తమ నియోజకవర్గ పరిధిలో మండల, గ్రామ గ్రామస్థాయిలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారుఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయిని, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజుని ఉప అధ్యక్షులు తాడి నరసింహారావు ని దుస్సాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.