జనం న్యూస్ మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల
గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమిం గ్లలకు దూరంగా ఉండాలని కాట్రేనికోన ఎస్ఐ ఐ.అవినాష్ సూచించారు. యువత, విద్యా ర్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ఫ్లాట్ ఫామ్స్, ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడొద్ద న్నారు. తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్కు యువత బానిసలు అవుతున్నారన్నారు అప్పులు చేసి, ఆర్థికంగా నష్ట పోవడంతో మానసిక ఒత్తిడికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, ఆధునిక సాంకేతికత సాయంతో ఇలాంటి అక్రమ కార్యక్రమాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటుందని అవినాష్ తెలిపారు, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్త నపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి,బెట్టింగ్లపై పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు


