జనం న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
సీతారామయ్య ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన 3D ఫోటోగ్రఫీ సేవలు అందించాలని స్టూడియో నిర్వాహకులను కోరారు. కాలనీవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభపడాలని ఆకాంక్షించారు.ప్రారంభోత్సవ వేడుకలో స్థానికులు, అభిమానులు, పలు ప్రముఖులు పాల్గొనడంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది.



