Listen to this article

జనం న్యూస్ 30 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఇ రోజు 30/03/2026 నా సోమవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైఎస్ఆర్ సర్కిల్లో విద్యార్థుల నిరుద్యోగుల పోరు దీక్ష ను జయప్రదం చేయాలని కోరుతున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి మోసపూరిత మాటలతో గారడీల మాటలతో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని విద్యార్థినీలకు స్కూటీలు అందజేస్తామని ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని జాబ్ కాలండర్ ప్రకటిస్తామని చెప్పి నేటికీ రెండున్నర సంవత్సరాలు దాటిన ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని ఇందుకు నిరసనగా నిరుద్యోగులు పోరు దీక్షను చేపట్టినారు. ఆ పోరు దీక్షకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యార్థులకు చెల్లించవలసిన తొమ్మిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ఉన్నత విద్య మూలకుపడుతున్నదని పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్న వారికి చదువు లేదు, చదువు అయిపోయిన వారికి సర్టిఫికెట్లు లేక ప్రైవేటు యాజమాన్యం ఇవ్వక ప్రైవేట్ కళాశాల చుట్టూ తిరుగుతున్నారని లక్షలాదిమంది విద్యార్థుల జీవితం అగమ్య గోచరంగా మారిందని ప్రైవేట్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే విద్యాసంస్థలు మూసివేస్తామని గత సంవత్సరం నుండి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నిరసనలు తెలిపిన విద్యాసంస్థలు బంద్ పెట్టిన ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని దున్నపోతు మీద వాన పడిన చందంగా మారి వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను చెల్లించకుండగా ఉందని దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పట్టించుకోవటం లేదని దీంతో విద్యార్థులు పోరు దీక్షకు పూనుకున్నారని విద్యార్థులు, కళాశాల యాజమాన్యం గద్వాలలో జరిగే పోరు దీక్షకు పూనుకున్నారని విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.రాష్ట్ర బీఆర్ఎస్వి, జిల్లా బీఆర్ఎస్వి చేపట్టిన ఈ దీక్షకు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలికి సంపూర్ణ సహకారము అందించవలసిందిగా కోరుతున్నాను.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా :-ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బోయిళ్ల విద్యాసాగర్, బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, విజయ్ కుమార్, ఐజ మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్, అల్లంపూర్ మున్సిపల్ చైర్మన్ పిండి జయరాములు, వడ్డేపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కర్ణ సూరి, గట్టు మాజీ జెడ్పిటిసి బాసు శ్యామల, ధరూర్ మాజీ జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర్ రెడ్డి,అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు ప్రేమలత, కేటి దొడ్డి మండలం మాజీ ఎంపీపీ మనోహరమ్మ, గద్వాల టౌన్ మైనారిటీ సీనియర్ నాయకులు అతికూర్ రెహమాన్, ఐజ పట్టణ అధ్యక్షుడు మాస్టర్ మధు కుమార్, అలంపూర్ పట్టణ అధ్యక్షుడు వెంకట రామయ్య శెట్టి మరియు విద్యార్థి విభాగం నాయకులు, యూత్ విభాగం నాయకులు పార్టీ నాయకులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య తెలిపారు