

జనం న్యూస్ 2025 ఫిబ్రవరి 12 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ స్థాపించబడి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని యూనియన్ ఆఫీసులో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఉత్సవాలను జిల్లా యూనియన్ జిల్లా అధ్యక్షులు జంబిగ వేణు , జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ఎల్ ఎన్ రెడ్డి, డిస్కం కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1104 యూనియన్ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పనిచేస్తుందన్నారు. ఈ యూనియన్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అనుబంధంగా కూడా పనిచేయదని తెలిపారు. కేవలం కార్మికుల యొక్క శ్రేయస్సుకై పోరాటం చేస్తుందన్నారు.1104 యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనియన్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో యూనియన్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాంపురం నాగేష్, కామారం శ్రీనివాస్, వరప్రసాద్, ప్రశాంత్, తూప్రాన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చందు నాయక్ ,మెదక్ జిల్లా యూనియన్ సభ్యులు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.