జనం న్యూస్ మార్చి 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండకేంద్రంలో ఆయిల్ పామ్ రైతులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన శాఖ మరియు ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేసవి కాలంలో పంట నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం ఏర్గట్లమండలంలో 130 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట కోతకు వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు 39 మంది రైతులకు 57 టన్నుల ఉత్పత్తికి గాను రూ. 11,86,723లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.శిక్షణ కార్యక్రమంలో భాగంగా వేసవికాలంలో ఆయిల్ పామ్ పంట సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి నిర్వహణ, ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు గడ్డం లింగారెడ్డి, గుండేటి చంద్రశేఖర్, కొప్పేల మారుతి రెడ్డి మరియు మండలానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.


