Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 12,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )పేదింటి ఆడపడుచు వివాహానికి పుస్తె మట్టెలు, పెండ్లి చీరె అందచేసి , అండగా నిలిచాడు నూతన గౌడ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో రిత్విక,నివాసంలో కుమ్మరి చంద్రం కూతురు రిత్విక కు ఆయన చేతుల మీదుగా పుస్తె మట్టలు, పెండ్లి చీరే అందజేశారు. ఈ వివాహం ఈనెల 14 వ తేదీన జరుగనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఎన్ని ఆస్తులు డబ్బులు సంపాదించిన కలగని సంతోషం నిరుపేద కుటుంబాలకు సాయం చేయడంలో ఎంతో సంతోషం కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామమస్థులు తదితరులు పాల్గొన్నారు.