

భద్రాచల దేవస్థానం రామకోటి రామరాజు సేవను గుర్తించింది- ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయకుమార్ శ్రీరామనవమి నాడు భద్రాచల సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లు (గోటి తలంబ్రాలు) మాత్రమే వాడుతారు. ఇందులో పాల్గొనే అవకాశం భద్రాచల దేవస్థానం, గజ్వేల్ లోని రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు 250కిలోల గోటి తలంబ్రాలు ప్రకటించడం అభినందనీయమని,సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి .ఈ సందర్బంగా మాట్లాడుతూ రామకోటి రామరాజు, గత 26 సంవత్సరాల కృషి, పట్టుదలను గ్రహించిన భద్రాచల దేవస్థానం ముచ్చటగా మూడోసారి గోటి తలంబ్రాల్లో పాల్గొనే అవకాషాన్ని అందించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. భద్రాచల దేవస్థానం పలుమార్లు మరో భక్త రామదాసుగా సన్మానించిన కీర్తించడం ఆయన భక్తికి నిదర్శనం అన్నారు.