Listen to this article

జనం న్యూస్ మార్చ్ 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండల ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష పార్టీగా తమ వైఖరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అవగాహన రాహిత్యంతో సంధి పేలాపన పేలుతున్నారని, వైసిపి వైఖరి అమరావతిపై ఏమిటి అన్న విషయంపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేతైన బొత్స సత్యనారాయణకి తీర్మానానికి బిల్లుకు కనీసం అవగాహన లేకుండా శాసనసభ్యులుగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ అమరావతికి చట్టబద్ధత లేదని తీర్మానం పనికిరాదని ఆవాకులు చవాకులు మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని నాగ జగదీశ్ ఎద్దేవా చేశారు. పునర్ విభజన చట్టములోని సెక్షన్ 5(2) ప్రకారం రాష్ట్రానికి హక్కు ఉందని, విభజన చట్టంలో పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, తదుపరి కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్ణయం ఉంటుందని, రాజధాని నిర్ణయం విభజన చట్ట ప్రకారం కేంద్రం ప్రకటించవలసి ఉందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధానిగా అమరావతిని అని పేర్కొంటూ చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చట్ట సవరణ ను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ తీర్మానం చేసిందని నాగ జగదీష్ అన్నారు. రాజధాని విషయంలో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాన్ని మార్చుకోకుండా కొనసాగించే చట్ట సవరణకు అవకాశం కేంద్రం ప్రధాని పీఎంఓ ఆఫీస్ రాష్ట్రానికి లేఖ రాసిందని దాని ప్రకారమే శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందని, ఈ ఒక్క విషయం కూడా వైసీపీకి తెలియకపోవడం వింతగా ఉందని ఇంకా రాష్ట్రాన్ని భవిష్యత్తు లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని, ఒక్క అమరావతి రాజధాని నిర్మాణం చేస్తూనే అన్ని జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణకు ఇప్పటికే శ్రీకారం చుట్టి ఏ జిల్లాలో ఏ ఏ పరిశ్రమలు నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకుంటూ పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని, ప్రాంతాలను రెచ్చగొట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్యన కుoపట్ల రాజేయడం, వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము ఏం చెప్పినా నమ్మేస్థితిలో ఉన్నారని ఇంకా బ్రమలోనే ఉన్నారని, వైసిపి గ్రాఫ్ 39.8 నుంచి 21.20కి దిగజారిపోయిందని భవిష్యత్తులో వైసిపి మునిగిపోయే నావేనని ఆ నావ పై ప్రయాణం చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని నాగ జగదీష్ హితువు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.