Listen to this article

బిచ్కుంద మార్చి 31 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), బిచ్కుందలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నేడు “పరిశోధన పద్ధతి మరియు ప్రాజెక్టు వర్క్” అనే అంశంపై ఒకరోజు జాతీయ స్థాయి ఆన్లైన్ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ పరిశోధనా పద్ధతి ప్రాజెక్టు వర్క్ అనే అంశం విద్యార్థులకు మరియు పరిశోధకులకు ఎంతో ఉపయుక్తమైనదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్త డా. టి. హన్మండ్లు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పరిశోధక విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఈ వర్కషాప్ ఉపయోగ పడుతుందని ముఖ్య వక్తలు డా. అమ్తుల్ వాహెబ్ గ పరిశోధన పద్ధతులపై విస్తృతంగా వివరణ ఇచ్చారు. డా. జి. శ్రీనివాస్ పరిశోధనలో సాంకేతిక అంశాలను వివరించగా, డా. వి. రాఘసుమ పరిశోధన ల కొరకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక వనరుల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం పట్ల కళాశాల కమిషనరేట్ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. ఆర్. రాజేంద్ర సింగ్ నిర్వహుకులకు అభినందనలు తెల్పి, ఇలాంటి కార్యశాల వల్ల గొప్ప పరిశోధనలు రావాలని సూచించారు.జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నట్లు కార్యక్రమ సమన్వయకర్త డా. టి. హన్మండ్లు గారు తెలిపారు.కార్యక్రమం సహా సమన్వయ కర్త డా. వై. సంజీవరెడ్డి గారు, ఈ కార్యక్రమం నిర్వహణకు అనుమతి ఇచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ గారికి మరియు వక్తలు గా పాల్గొన్న వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నివేదన కర్త డా .టి.అశోక్ రావ్ వ్యవహరించారు అధ్యాపకులు గౌసోద్దీన్, మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు