Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్


జనం న్యూస్ 13 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న మహిళా సంరక్షణ పోలీసుల సేవలను క్షేత్ర స్థాయిలో వినియోగించు కోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 12న పోలీసు అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలను MSP ల సహకారంతో గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. గ్రామం/వార్డు పరిధిలోకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తించాలని, వారు ఏ ప్రాంతం వారు, ఎందుకు, ఎక్కడ నుండి వచ్చింది MSPల సహకారంతో తెలుసుకోవాలన్నారు. వారు చెప్పిన కారణాలు నిజమో, కాదో తెలుకోవాలన్నారు.క్షేత్ర స్థాయిలో ప్రజలకు సైబర్ మోసాలు, మహిళా రక్షణకు అండగా ఉండే చట్టాలు, రహదారి భద్రత, మహిళా భద్రత పట్ల, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను, సంకల్పం వంటి కార్యక్రమాల పట్ల MSPలు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.వారంలో ఒకసారి MSPలతో సంబంధిత SHOలు సమావేశం నిర్వహించి, క్షేత్ర స్థాయిలో విషయాలు గురించి అడిగి తెలుసుకోవాలని, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నేరాలు, మోసాలు, గ్రామ తగాదాలు, భూతగదాలు, రాజకీయ వివాదాలు గురించి ముందస్తు సమాచారాన్ని MSPలు సేకరించి, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేసే విధంగా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు సమాచారం MSPలకు లభ్యమయ్యే విధంగా సమాచార వ్యవస్థను మెరుగుకోవాలని, గ్రామాల్లో పేకాటలు, కోడి పందాలు, బెల్టు షాపులు వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగ కుండా MSPలు సమాచారం సేకరించి, ఉన్నతాధికారులకు అందించాలన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, గ్రామాల్లో, వార్డుల్లో సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా ప్రజలు ఏర్పాటు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని MSPలను ఆదేశించాలన్నారు. MSPల సేవలను క్షేత్ర స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, పోలీసులకు తెలియకుండా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు సమాచారం సేకరించి, వివాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.