జనం న్యూస్ 01 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో చికెన్ షాపులను బంద్ చేసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యజమానులు మాట్లాడుతూ…పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1.8 గా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం 1.5కి తగ్గించడమే ఈ బంద్‌కు ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ బంద్ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల. యజమానులందరూ ఈ బంద్‌లో పాల్గొని, దీనిని విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌలీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా హెచ్ఛరించారు..


