Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

పేద ప్రజల సంక్షేమం నిరంతరం ఆలోచన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ ఎన్టీఆర్ భరోసా పథకంలో ఏప్రిల్ నెల 1వ తేదీన ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో తెల్లవారు ఆరు గంటలకే పెన్షన్ లబ్ధిదారులు ఇంటికి వెళ్లి వారి ఇంటి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని దివ్యాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ప్రభుత్వ వాణిజ్య ప్రముఖులు తెలుగుదేశం నాయకులు బొడ్డేడ రాము చేతుల మీదు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ పేదవాడు ఆకలితో ఉండకూడదని పట్టెడన్నం పెట్టాలని ఎన్టీఆర్ ఆశయం నేడు నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా లక్షలాదిమంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల కారుబాబు కాండ్రేగుల వెంకట సూరి సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.