క్రైస్తవుల దౌర్జన్యాలపై బిజెపి నాయకుల ఆగ్రహం
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై దాడికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం అనకాపల్లి పట్టణం, చదువులవారి వీధిలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. భారతీయులకు పర్వదినం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆకువీడు పెదపేట రామాలయానికి దర్శనానికి కూటమి నేతలతో కలిసి రఘురామ కృష్ణంరాజు వెళ్లారన్నారు. డీఎస్పీ స్థాయి అధికారి పరిరక్షణలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు రఘురామ కృష్ణంరాజు కూటమి నేతలు, భక్తులకు రక్షణగా ఉన్నప్పటికీ మారణాయుధాలతో దాడులకు దిగారoటే ఘటన వెనుక పెద్ద కుట్ర కోణం ఉందన్నారు. దాడి వెనుక పెద్దల ప్రోద్బలం, హస్తం, రెచ్చగొట్టడం వంటివి ఉన్నాయని అటువంటివారు ఎంతటి వారినైనా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా మాజీ ఎంపీ హర్ష కుమార్, జడ శ్రావణ్, పివి సునీల్ వంటి పెద్దల పేర్లు విచారణలో వినిపించడం చూస్తుంటే, బరి తెగించిన క్రైస్తవ నాయకులపై అత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని లేకపోతే హింసను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం హిందూ పండగల సమయంలో హిందూ భక్తులకు రక్షణ కల్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా ప్రదాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, యువ మోర్చా యువ నాయకుడు గేదెల స్వరూప్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బొడ్డేడ బాస్కరరావు, జిల్లా ఐటి కన్వీనర్ కొణతాల సాయిరాం ప్రసాద్, గాలి శ్రీనివాసరావు, కె గణేష్ తదితరులు పాల్గొన్నారు.


