Listen to this article

జనం న్యూస్, 2026 ఏప్రిల్ 1, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కొల్లూరు గ్రామంలో, సి సి రోడ్డు నిర్మాణ పనులను, గ్రామ సర్పంచ్ చింతల గట్టు శివరాజ్, బుధవారం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధుల నుండి రూ. 5 లక్షలతో, వంధ మీటర్ల పొడవున, ఈ సిసి రోడ్డును నిర్మిస్తున్నట్లు, తెలిపారు.ఈ కార్యక్రమంలో, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్,మరియు వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, డప్పూర్ సంగమేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, సుభాకర్, గ్రామ పెద్దలు, వీరిశెట్టి పటేల్, మంగలి మొగులయ్య, డప్పూరి రాములు, చాకలి మనయ్య, చింతలగట్టు మొగులయ్య, నర్సయ్య, యేసయ్య, శేరి సంగయ్య, గ్రామప్రజలు,తదితరులు పాల్గొన్నారు.