

జనం న్యూస్ 13 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : హజరత్ షరీఫ్ అవుతుల్లా ఖాదర్ వలీ బాబా దైవ స్వరూపులని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. విజయనగరంలోని బాబా మెట్టలో నిర్వహించిన 66వ మహాసూఫీ సుగంధ మహోత్సవాల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు. ముందుగా ఖాదర్ బాబాను దర్శించుకుని చాధర్ సమర్పించారు. బాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దర్గా ప్రతినిధులు పాల్ న్నారు.