బిచ్కుంద ఏప్రిల్ 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం
రాజుల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ జై కుమార్ సందర్శించినారు.ఏప్రిల్ ఒకటో తేదీ నాడు అంగన్వాడీ కేంద్రంలో వివిధ కార్యక్రమాలను పరిశీలించి రికార్డు లను తనిఖీ చేసినారు. అంగన్వాడీ టీచర్ సరస్వతి మాట్లాడుతూ ప్రతినెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు పిల్లల యొక్క ఎత్తు బరువు కొలతలు చేపడతామని అలాగే గర్భిణీలో బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. బాలింతలు గర్భిణీలకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం జరుగుతుందని 36 మందికి బాల్ అమృతం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ సుధీర్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు సాయిలు మల్లికార్జున్ గ్రామస్తులు, ఉపాధ్యాయులు మహిళలు పాల్గొన్నారు.



