జనం న్యూస్ ఏప్రిల్ ఒకటి చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో
కృషి విజ్ఞాన కేంద్రం ,తునికి ఆధ్వర్యంలో గంగారం గ్రామంలో భూమి “సుపోషణ మరియు భూసార పరీక్షణ” కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ,తునికి ఉద్యాన శాస్త్రవేత్త ఎం శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీ రాజశేఖర్ గౌడ్, ఏఇవో కృష్ణవేణి .,గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ,గ్రామ రైతులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు కింద విషయాలు వివరించడం జరిగింది వరి కోత తర్వాత కొయ్యకలను కాలబెట్టడం వల్ల భూమి సారం తగ్గించడం,సూక్ష్మ జీవులు చనిపోయి దిగుబడి తగ్గుతుంది .కాబట్టి వరి కొయ్యకలను కట్టించే యంత్రాలను ఉపయోగించి నెలలో కలియబెట్టి దునాలని అవగాహన జపించడం జరిగింది పంటకు ముందు ప్రతి ఎకరానికి 8-10 టన్నుల సేంద్రీయ ఎరువులను వాడాలి అదేవిధంగా జనుము జీలుగా తప్పనిసరిగా భూమిలో వెదజల్లి 50 శాతం పూత దశలో నెలలో కలియబెట్టడం వల్ల దాదాపు 20 టన్నుల సేంద్రీయ ఎరువు భూమిలో తయారు అవుతుందని అదే విధంగా భూమిలో సేంద్రీయ కార్బన్ పెరుగుతుందని వివరించడం జరిగింది జీవనేరువులను కూడా ఉపయోగించి ,రసాయన ఎరువులను ప్రతి పంటకి సూచించిన మోతాదు లో వాడి నేల ఆరోగ్యాన్ని కాపాడేలా అవగాహన కల్పించారు అదే విధంగా కలుపు మందులను రసాయనిక ఎరువులను మెల్లమెల్లగా పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాఈయం చేసి నెల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు


