Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 01 ఏప్రిల్

ఆటో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే దస్తగిరి (చోటు)

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరత లేదని ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు డిజిల్ డీలర్లు ప్రకటిస్తున్న కానీ వందలాది ఆటోలు బంకుల ముందు లైన్లు కడుతున్న సందర్భం చూస్తే వీళ్ళు చెప్పేదంతా అబద్ధమే అనిపిస్తుందని, ఏకంగా హైదరాబాదులోని కొన్ని పెట్రోల్, గ్యాస్, డిజిల్ బంకులు మూసివేయడం ద్వారా పటాన్ చెరులోని జిఎంఆర్ బంకు ముందు 300 ఆటోలు లైన్ కట్టడం చూస్తుంటే రాష్ట్రంలో చమురు కొరత ఏంత ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని, 12 గంటలు లైన్ కడితే గాని డీజిల్ దొరకడం లేదని పైగా ఒక్కొక్క ఆటో దగ్గర అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని,దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే దస్తగిర్ (చోటు) ఖండించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రకటనలు మాని వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజిల్ డీలర్లను దస్తగిర్ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు