

జనం న్యూస్ 13 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ; విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహా కుంభమేళాకు 36 మంది భక్తులతో సూపర్ లగ్జరీ బస్సు బుధవారం జిల్లా ప్రజా రవాణాధికారి సి హెచ్, అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా త్రివేణి సంగమంలో స్నానం దర్శించుకుని 18 వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ప్రయాణికులకు అనుగుణంగా మహా కుంభమేళకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మరిన్ని వివరాలకు 99592 25620 ,94943 31213, 9440359596 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.