జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 1 సెల్ 9550978955
నాదెండ్ల (తూబాడు): మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి స్వర్గీయ అన్నమ్మ రెండో వర్ధంతి కార్యక్రమం ఈరోజు నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజిని , మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మరియు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత అన్నమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. సమాజం పట్ల ఆమెకున్న మమకారాన్ని, ఆమె జ్ఞాపకాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.అనంతరం, వర్ధంతిని పురస్కరించుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేవలం నివాళులర్పించడమే కాకుండా, పేద ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని టీజేఆర్ సుధాకర్ బాబును కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మెడికల్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. అనేకమంది ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.


