Listen to this article

గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు బిక్కా రామాంజనేయరెడ్డి

(జనం-న్యూస్): ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఫిబ్రవరి 12 ; ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం సలకలవీడు గ్రామ నివాసి గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు రామాంజనేయ రెడ్డి జనం-న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ మనందరి ప్రియతమ నేత మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం.. చరిత్ర మరవదని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఒక ప్రక్క రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ మరోపక్క సంక్షేమాన్ని అమలు పరుస్తూ అత్యంత విజయవంతంగా పరిపాలన కొనసాగించినారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా తమది మహిళా సంక్షేమ ప్రభుత్వమని చెబుతూ అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సున్నా వడ్డీ పలు పథకాల్లో మహిళలకే పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళల పేరు మీదనే స్థలములు ఇచ్చి ఇల్లు కట్టించి లక్షల రూపాయలు స్థిరాస్తి అక్క చెల్లెమ్మలకు ఇచ్చినారు అని గర్వంగా చెప్పవచ్చు.రాజకీయంగా కూడా అన్ని స్థానాలలో మహిళ నేతలకు పదవులు వచ్చేలా చూస్తూ దిశా చట్టాన్ని తయారుచేసి దిశా చట్టము స్ఫూర్తితో రాష్ట్రంలో నెలకొల్పిన పోలీస్ స్టేషన్ లు వాహనాల టెక్నాలజీని ఉపయోగించుకొని తయారుచేసిన దిశ యాప్ మహిళా భద్రతకు పెద్ద పీట అని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో అన్నదాతలకు అండగా నిలిచేలా పంట పెట్టుబడి సాయం అందించడానికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానిక అన్నదాతలకు పలు సేవలు అందిస్తూ గతంలో నిర్లక్ష్యాన్ని గురైన కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి అన్ని వ్యవసాయరంగా ప్రయోజనాలను కల్పిస్తూ సున్నా వడ్డీ పథకం ద్వారా పంట రుణాలు అందిస్తూ మునుపు ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్ నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోపు ఇన్ సబ్సిడీ ఇస్తూ మాది వ్యవసాయ రంగ ప్రభుత్వము అని నిరూపించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో మధ్యతరగతి పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వైద్యరంగంలో ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి మెరుగైన చికిత్సల కోసం ఆంధ్రప్రదేశ్ పౌరులు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్తగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు కడుతూ కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాన్ని బలోపేతం చేసిన ఒక గొప్ప నాయకుడు అని చెప్పవచ్చు. రాష్ట్రంలో పేద విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని అమ్మ ఒడి,వసతి దీవెన, విద్యా కానుక,విద్యా దీవెన,గోరుముద్ద సంపూర్ణ పోషణ, కంటి వెలుగు, పథకాల ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి వీలుగా ఇంగ్లీష్ మీడియా విద్యాబోధన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన విద్యాదాత మన నాయకుడిని చెప్పవచ్చు.రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు, వాటి అనుబంధంగా పనిచేసే వేలాదిమంది వాలంటీర్ల సహాయముతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గడపకు పోవడం ఒక స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్రములోనే జరిగినవి చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రజలలోకి వచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను పాలనా చేపట్టిన తర్వాత వైయస్ జగన్ ఏనాడు మరవలేదు. తన కళ్ళు ముందే ఉండేలా ఏర్పాటు చేసుకొని సందర్భం వచ్చినప్పుడల్లా తన ఇచ్చిన హామీలు అందరికి గుర్తు చేస్తూ పాలన మొదలైన వెంటనే నవరత్న పథకాలను ఒక్కొక్కటిగా అమలు తెచ్చి మేనిఫెస్టోలో చెప్పినవే కాదు ఇచ్చిన హామీలు కూడా ప్రజలు ముందుకు తెచ్చి రాష్ట్రంలో అత్యధిక జనాభా ఆధారంగా ఉండే రంగాలలో వైద్య, విద్య,వ్యవసారంగాలపై ప్రత్యేక దృష్టిపెట్టి అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ..