Listen to this article

జనం న్యూస్ 02 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

గ్రామ సభలో పాల్గొని మాట్లాడిన.. పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి..మల్దకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం స్పెషల్ ఆఫీసర్‌ మేఘన,పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ సర్పంచ్ పెద్దపల్లి అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి,ఉప సర్పంచ్ లక్ష్మి నర్సిములు,ల అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. సమావేశాలో గ్రామ అభివృద్ధి ప్రణాళికా, రూప కల్పన, అమలుపై చర్చించి. ముందుగా శుభ్రత, పరి శుభ్రత కింద సీసీ రోడ్డు, మురికి కాల్వలు నిర్మించడంతో పాటు మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తులు,తీర్మానం, చేసినట్లు, అలాగే పెద్దపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా చేస్తానని సర్పంచ్ శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్‌ మేఘన, కార్యదర్శి వేణుగోపాల్, వార్డు సభ్యులు, శివ, కిష్టన్న, సుజాత, పావని వెంకటేష్, అంజనమ్మ సవారీ, అంగన్వాడీ టీచర్లు, ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామస్తులు, అశోక్, మద్దిలేటి, రంగస్వామి, అంజి, ప్రభాకర్, పంపయ్య, ఈశ్వర్,శ్రీశైలం ప్రశాంత్, యువకులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.