జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కేంద్ర మంత్రి గడ్కరిని కోరిన డికె అరుణ జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంగా రెండు పెద్ద రహదారులను ఇవ్వాలని పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికె అరుణ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ని కోరారు.ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి తో భేటీ అయిన ఎంపీ డి కె అరుణ , ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంత అభివృద్ధికి కీలకమైన రెండు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల మంజూరును కోరారు. ఎర్రవల్లి – గద్వాల్ – రాయచూర్ రహదారి (67 కి.మీ)*కొత్తకోట – గద్వాల్ – మంత్రాలయం రహదారి (90 కి.మీ) ఈ రోడ్లు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతాయి.పర్యాటకం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయి. బీచుపల్లి & మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలకు సులభ ప్రయాణం.15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మద్దతు తెలిపారు. ఇరిగేషన్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతలో ఈ రెండు గ్రీన్ ఫీల్డ్ రహదారులు ఎంతో అవసరమని డికె అరుణ కేంద్ర మంత్రికి తెలియజేస్తూ వెంటనే వాటికి ఆమోదం ఇవ్వాలని వినతిపత్రాన్ని అందజేశారు.


