జనం న్యూస్ ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామ పంచాయతీ వేట్లపాలెం గ్రామం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని ప్రదేశాన్ని ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు సందర్శించారు. వేతన శ్రామికులు అందరూ ఉదయం 6:30 గంటలకే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, గ్రూపులో సభ్యులందరు విధిగా ఉపాధి పనులకు హాజరు కావాలని హితవు పలికారు. అందరూ హాజరైతేనే సరాసరి ఉపాధి వేతనం ఎక్కవ మొత్తంలో వస్తుందని సూచించారు. పని ప్రదేశంలో మంచినీటి వసతి, నీడ నిమిత్తం పందిరి ఏర్పాటు చేయాలని క్షేత్ర సహాయకులు & వారిని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు విధిగా నిర్వహించాలని, సత్వర చర్యలు గైకొనాలని పిలుపునిచ్చారు. సదరు సందర్శనలో ఏపీవో చంద్రమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ సూర్య నారాయణ రాజు, క్షేత్ర సహాయకులు & సిబ్బంది పాల్గొన్నారు.



