Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 ఏప్రిల్

సంగారెడ్డి జిల్లా ఝారసంగం మండలం, సంగం (కె) గ్రామా నికి చెందిన ప్రముఖ కవి, రచ యిత నారాయణ మరో ప్రపంచ రికార్డును సాధిం చారు. గత మార్చిలో జరిగిన అంతర్జాతీయ సాహిత్య పోటీల్లో తెలుగు భాషలో 193 అంశాలపై కవితలు రాసి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈయనకు 9 ప్రపంచ రికార్డులు, 11 జాతీయ అవార్డులు, 194 కవి సమ్మేళన అవార్డులు మరియు 2 గౌరవ డాక్టరేట్లు లభిం చాయి.దిగ్వాల్ పాఠశాలలో చదివేటప్పుడు తన గురువు గోపాల్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి చేర్చిందని నారా యణ ఆనందం వ్యక్తం చేశారు. ఒక కుగ్రామం నుండి అంతర్జా తీయ స్థాయికి ఎదిగి, రికార్డుల పరంపరను కొనసాగిస్తున్న నారాయణపై సాహితీవేత్తలు ప్రశంసలు కురిపించారు