Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం పేకాట స్థావరాలపై దాడులు చేసి ఐదుగు రిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు వివరాల్లోకి వెళితే మండలంలోని తహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు, కొంతమంది వ్యక్తులు గుంపుగా చేరి డబ్బులతో పేకాట ఆడుతున్నారని తెలిసి పోలీసులు చర్యలు చేపట్టారు.దాడి సందర్భంగా పోలీసులు అక్కడ ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2,500 నగదు, మూడు మొబైల్ ఫోన్లు ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వారిలో కంబాల శివ, తక్కళ్ల సాయికుమార్, బండారి రమేష్, బెడితల రాజ్‌కుమార్, కుక్కల రాజు తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సతీష్ శ్రీనివాస్ ఖలీల్ క్రాంతి నరేష్ పాల్గొన్నారు….