Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం సమాజమా స్పందించుమా అత్యాచారం క్షమించరాని నేరం అనే సాంగ్ ని శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో రిలీజ్ చేశారు ఈ సందర్భంగా శాయంపేట సిఐ, పి రంజిత్ రావు మాట్లాడుతూ రచయిత మొగ్గం సుమన్ ఈ పాటను రాసి సింగర్ తుడుం క్రాంతి కుమార్ తో పాడించి వీడియో రూపంలో రిలీజ్ చేయడం గొప్ప విషయమని సమాజంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను, విలువను తెలిపే విధంగా ప్రయత్నం చేయడం మంచి పరిణామం అని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలపై చేస్తున్న అత్యాచారాలను పారద్రోలాల్సిన అవసరం ఉందని ఆడవారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రచయిత మొగ్గం సుమన్ మంచి సాహిత్య విలువలతో పాట రాశాడని భవిష్యత్తులో మరెన్నో పాటలు రాసి సమాజ శ్రేయస్సుకోసం ముందుకు సాగాలని కొనియాడారు. సింగర్ తుడుం క్రాంతి కుమార్ ఇలాంటి పాటలు మరెన్నో పాడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సమాజంలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వీడియో రిలీజ్ కార్యక్రమంలో శాయంపేట మాజీ జడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి కృష్ణమూర్తి, బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపల్లి క్రాంతికుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అరికిల్ల దేవయ్య, బి ఎస్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరపల్లి విజయకుమార్, మండల అధ్యక్షులు మారపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు….