గట్టుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామేల్
జనం న్యూస్ 02 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా
పూడూర్ మండల్ గట్టుపల్లి గ్రామ పంచాయితీ దగ్గర ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బొల్లి రాజు కు 32,000/- వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గట్టుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామేల్ అందజేశారు. ఈ సందర్భంగా సామేల్ మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు నిరుపేదలకు వరమని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్రహం, కావలి బందయ్య, పంచాయతీ సెక్రెటరీ అబ్దుల్లా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అబ్దుల్ సాదక్, కావలి అనంతమ్మ, కావలి మంజుల, వార్డు నెంబర్లు దోమ రవి, కావలి చంద్రశేఖర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసు, ఎస్ నర్సిములు పాల్గొనడం జరిగింది.


