జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 2
తర్లుపాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పదవీ కాలం ముగిసిన మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులకు ఘనంగా వీడ్కోలు పలికారు. మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) సూరెడ్డి భూలక్ష్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాం నాయక్, డిప్యూటీ ఎంపీడీఓ రాఘవరావు, ఏ ఓ బుర్రి చంద్రశేఖర్ సర్పంచులను సాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం అనంతరం ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి సుబ్బారెడ్డి, ఎంపీడీఓ జయరాం నాయక్, ఏఓ చంద్రశేఖర్, మరియు డిప్యూటీ ఎంపీడీఓ రాఘవరావు ప్రసంగించారు. గత ఐదేళ్లలో మండలంలోని వివిధ పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి పనులను వారు కొనియాడారు. మౌలిక సదుపాయాల కల్పనలో సర్పంచులు చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


