Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13.మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త జవాజి విజయభాస్కరరావు పర్యవేక్షణలో బుధవారం అంకురార్పణతో మొదలయ్యాయి ఆలయ అర్చకులు కారంపూడి రమణాచార్యులు ఆగమాచార్యులు లక్ష్మణ్ తిలక్ స్థానాచార్యులు రామగోపాలచార్యులు పరిచారకులు సాయి మోహన్ వేద పండితుల వేదమంత్రోచ్ఛారణతో గణపతి పూజా పుణ్యాహవాచనం రక్షాబంధనం అంకురార్పర బేరి పూజ ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ దాతలుగా జవాజి విజయభాస్కరరావు ధర్మపత్ని శేషు కుమారి. జవ్వాజి సాయి కృష్ణ ధర్మపత్ని హేమ సాయి వ్యవహరించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.