జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955
చిలకలూరిపే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ వారి సర్కూలర్ ప్రకారం, చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ కాంప్లెక్స్ మరియు గాంధీ పార్క్ దక్షిణం వైపు గల మున్సిపల్ కాంప్లెక్సుల్లోని షాపుల లీజు కాలం 25 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో,ఈ షాపులు స్వాధీనం చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాలకు గుర్తు కొనసాగింపు హక్కు కోసం బహిరంగ వేలం నిర్వహించనుంది చిలకలూరిపేట పురపాలక సంఘం.ROC.నెం.18823/J1/2008-J (34.17.11.2009), ROC.నెం.8061/2014/J2 (20-06-2014) ప్రకారం, 07-04-2026 ఉదయం 11 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం వద్ద కమిషనరు లేదా అనుమతిపొందిన అధికారులచే వేలం జరుగుతుంది. వేలం నోటిఫికేషన్‌లోని షరతుల ప్రకారం ఈ ప్రక్రియ జరగనుంది.వివరాలు ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ కాంప్లెక్స్ (గాంధీ పార్క్): షాపు నెం. 2, 1-14,17-29, 2,4-11,14-18,20,21. ప్రాథమిక ధరావత్తు: రూ.50,000/- (షాపు ఒక్కటికి). అగ్రిమెంట్‌కు ముందు డిపాజిట్: రూ.5,00,000/-.మున్సిపల్ కాంప్లెక్స్: ప్రాథమిక ధరావత్తు: రూ.5,000/-, డిపాజిట్: రూ.2,00,000/-, సాల్వెన్సీ: రూ.3,00,000/- (షాపు ఒక్కటికి). షాపు నెం.లు: 16.ఇతర వివరాలు సంబంధిత రెవెన్యూ విభాగంలో ఆఫీసు పని వేళల్లో అందుబాటులో ఉన్నాయి.ఆసక్తిగల వారు త్వరగా సంప్రదించాలని కమిషనర్ పి.శ్రీహరిబాబు పత్రికా ప్రకటన రూపంలో తెలిపారు.


