జనం న్యూస్, ఏప్రిల్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల
కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పలుకుటుంబాలను పరామర్శించారు.
గ్రామ శాఖ అధ్యక్షులు దేవుడు నర్సయ్య గారి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారిని కలిసిపరామర్శించారు. అలాగే నిమ్మన గంగయ్య గారి తల్లి ఇటీవలస్వర్గస్తులైనందున వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజా పూర్ణనందం, మాజీ ఎంపీటీసీ మధుసూదన్, మాజీ సొసైటీ చైర్మన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



