Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంది 15-02-2025 అనగ శనివారం ఉదయం 10:00 గం” నుండి సాయంత్రం 08:00 గం” ల వరకు కాట్రేనికోన మండలం లోని చెయ్యేరు సబ్ స్టేషనీలో పవర్ ట్రాన్స్ఫార్మర్ 5 ఎం వి ఏ నుంచి 8 ఎం వి ఏ కు పెంచుతున్న కారణముగా చెయ్యేరు సబ్ స్టేషను పరిధిలో అన్ని గ్రామాలకు అనగా చెయ్యేరు చెయ్యేరు అగ్రహారం పెనుమళ్ళ ఉప్పిడి బంటుమిల్లి లక్మివాడ మొదలగు అన్ని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా.నిలుపుదల చేయునని అమలాపురం ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ శ్రీ కే రాంబాబు తెలిపి యున్నారు. విద్యుత్ వినియోగదారులు మరియు ఆక్వా రైతులు అందరూ ఈ ఆశౌకర్యమును గమనించి సహకరించాలని ఆయన కోరారు