Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 13 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కానీ జనాభాలో మనదేశంలో అగ్రస్థానం ఉంది కండోమ్ అంటే తప్పుగా భావించే భ్రమలో మీరు ఉంటే అది కచ్చితంగా పొరపాటి ఎందుకంటే దీనిని కుటుంబ నియంత్రణ, లైంగిక సంక్రమించే ఇన్ఫెక్షన్లు ప్రమాదాన్ని నిరోధించే సాధనంగా చెబుతున్నారు నిపుణులు అందుకే దీన్ని ప్రాముఖ్యత అందరికి తెలియజేయాజేసే విధంగా ప్రతి సంవత్సరంఫిబ్రవరి 13 అంతర్జాతీయ కండోమ్ దినముగా ప్రకటించారు అని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మార్టూరు ఔట్లిచ్ వర్కర్ కండ్రతి దుర్గ పేర్కొన్నారు గురువారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల జిల్లా హెచ్ఐవి నిర్మూలన సమీకృత వ్యూహం దిశా,హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టి ఐ ఆధ్వర్యంలో మార్టూరు వి ఎస్ ఆర్ అండ్ ఏ ఎం డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది దుర్గా మాట్లాడుతూ కొండోమ్ వాడకం వల్ల లైంగిక సమయాల్లో సంక్రమించే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి నివేదిక ప్రకారం గత పది ఏళ్లలో దేశంలో 17 లక్ష మందికి పైగా హెచ్ఐవి సోకిందని హెచ్ఐవి పూర్తి నివారణ చికిత్స లేదు ఇటువంటి ప్రాణాంతకవ్యాధులు రాకుండా ఉండాలి అంటే కండోమ్ వినియోగం మంచిదని, ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే ముందు రోజు ఈ అంతర్జాతీయ కండోమ్ దినం ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే బాధ్యతాయుతమైన, సురక్షితమైన లైంగిక ప్రవర్తన నొక్కి చెప్పడానికి వాలెంటెన్స్ డే కి ఒక రోజు ముందు వ్యూహాత్మకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం జరుపుకుంటారు హెచ్ఐవి లేదా ఎస్ టి ఐ నివారించడంలో కండోమ్ వినియోగం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు లైంగిక ఆరోగ్య విద్య కోసం కండోమ్ ప్రాముఖ్యతను ప్రోత్సహించడం కోసం కండోమ్ వినియోగం చుట్టూ ఉన్న అపోహలను తొలగించడం కోసం ఈ అంతర్జాతీయ కండోమ్ డే నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం యొక్క లక్ష్యం అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు తమ లైంగికార్యం గురించి వారి ఎంపికలు గురించి సురక్షితమైన లైంగిక అభ్యాసాల గురించి హెచ్ఐవి ఎయిడ్స్ పూర్తిస్థాయిలో నియంత్రణ సుఖ వ్యాధుల నియంత్రణ కొరకు కండోమ్ వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పండు వీరగంధం శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ కె అంకమ్మ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ,మార్టూరు ఓవర్ డబ్ల్యూ జె. రూతు, సామ్రాజ్యం పాల్గొన్నారు