Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 5 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద పట్టణం మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ సీమ రమేష్ శెట్కార్ . మరియు కౌన్సిలర్ నౌషా నాయక్ . వీధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దని మున్సిపాలిటీలోని టాక్టర్ లో ఇంటి ముందల ఉన్న చెత్త వెయ్యాలని సూచించడం జరిగింది. రోడ్డుపైన అక్కడక్కడ చెత్త కుప్పలు వేయడం వలన అక్కడ దోమలు ఈగలు వాలి అనారోగ్యానికి గురి అవుతారని సూచించడం జరిగింది. ఎవరైనా చెత్త టాక్టర్ లో వేయకుండా ఇంటి ముందల్లా వేస్తే వాళ్లకు ఐదువందల రూపాయలు ఫైన్ మరియు నోటీసు జారీ చేయడం జరుగుతుందని సూచించడం జరిగింది మరియు అక్కడక్కడ వీధుల్లోని మురికి కాలువలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నౌషా నాయక్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు