Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 5 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)

ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని గా సీనియర్ నాయకులు యనమండ్ర విజయ కుమార్ ఎన్నికయ్యారు. స్థానిక స్థానిక గాంధీనగర్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు దంగేటి కృష్ణ నివాసం లో జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా గొల్లకోటి వెంకట రెడ్డి,కొమ్మిరెడ్డి సతీష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు విత్తనాల కరిమెలస్వామి, అల్లాడి మరియమ్మ, సత్యనారాయణ, అనుసూరి రాంబాబు, దేంగేటి కృష్ణ, మేడిశెట్టి పవన్ కుమార్, జొన్నలగడ్డ శ్రీనివాస్, చింతపల్లి రాంబాబు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని విజయ కుమార్ తెలిపారు.