Listen to this article

జనంన్యూస్ 5 ఏప్రిల్ ఘట్‌కేసర్ ప్రతినిధి

బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాచవాని సింగారం అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. స్వతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్118 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాచవాని సింగారం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నాగులపల్లి నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దళిత నాయకులు ప్రజలు పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశ ఉపప్రధానిగా, కార్మిక, రక్షణశాఖ మంత్రిగా పని చేశారని తెలిపారు. ఆయన సేవలు ఎన్నటికీ మరవలేనివని, ప్రతీ ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల జంగయ్య, పెరుమండ్ల సుదర్శన్, చుంచు నర్సింగరావు, సుంచు యాదగిరి, కిన్నెర రవీందర్, ఏర్పుల గిరిబాబు, గ్యార వెంకటేష్, కిన్నెర రత్నాకర్, మంద రాజు, పెరుమండ్ల ప్రభాకర్, కిన్నెర ప్రవీణ్, బండిరాల మధు, సందుపట్ల రాజు, గ్యార మహేష్ తదితరులు పాల్గొన్నారు.