Listen to this article

జనంన్యూస్ 5 ఏప్రిల్ ఘట్కేసర్ ప్రతినిధి :

ఘట్‌కేసర్: పోచారం డివిజన్ కొర్రెములలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి గ్యార గోవర్ధన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, భారత ఉప ప్రధానిగా ఆయన ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. 1935లో దళితుల సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడని తెలిపారు. సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన జగ్జీవన్‌రామ్‌ వ్యవసాయం, సమాచార, ప్రసార శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన గొప్ప రాజకీయ వేత్తని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ, కుర్రి లక్ష్మయ్య, శ్రీను మేస్త్రి , బిజెపి సీనియర్ నాయకులు పోలగొని మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.