Listen to this article

జనం న్యూస్ : పెబ్బేరు ఏప్రిల్ 6 2026 వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా

పెబ్బేరు మండలం పేరు గ్రామం నందు 6 -4 -2026 నాడు వనపర్తి రోడ్ లో గల శ్రీ శ్రీ శ్రీ మిట్ట ఆంజనేయస్వామి ధ్వజస్తంభం ప్రతిష్ట గావించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి పెబ్బేరు మండల మరియు గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు పెబ్బేరు మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మరియు టిఆర్ఎస్ నాయకులు మరియు హిందూ బంధువులందరూ అత్యధికంగా పాల్గొనడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల క్రమ పద్ధతిలో అన్ని రకాల వసతులను కల్పించడం జరిగింది అలాగే వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది.