Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

రామకృష్ణ కాలనీలో సామాజిక సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. రామకృష్ణ గణేష్ ఉత్సవ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా పండుగ వాతావరణాన్ని తలపించింది.యూత్ కమిటీ అధ్యక్షుడు భార్గవ్, కార్యదర్శి నందు, ఖజాంచి అశ్విత్ సమన్వయంతో సుమారు యాభై మంది సభ్యులు కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురేందర్ రెడ్డిని శాలువాలతో సన్మానించి, కేక్ కట్ చేయించి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగింది.ఈ వేడుకల్లో సత్యనారాయణ, గణేష్, తాండవ కృష్ణ, శ్రీధర్, సుధాకర్, సంజీవరెడ్డి, ప్రసాద్, జి. నర్సింగరావు, వెంకటేశ్వరరావు, జలంధర్ రెడ్డి, ఈ. రాజేందర్, కాశీనాథ్ యాదవ్, సి.కె. రెడ్డి, అరవింద్ రావు తదితరులు పాల్గొన్నారు. యూత్ కమిటీ సభ్యులతో పాటు అభిమానులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమం అనంతరం నర్సింగరావు, ప్రసాద్, శ్రీధర్ రావు, గణేష్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత రెండు రోజులుగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్నేహితులు, కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పత్రికా రంగానికి చెందిన సోదరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ వాసులు అందరూ తనకు శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.