Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 6:

జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన మహా హరినామ సంకీర్తన ఉత్సాహ భరితంగా సాగింది. భక్తుల కీర్తనలు, నృత్యాలతో రెండున్నర గంటలపాటు కొనసాగిన శోభాయాత్ర అద్యంతం రసభరితంగా కొనసాగింది. పట్టణంలో ప్రతి ఆదివారం హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నగర సంకీర్తన కార్యక్రమం 201 వారాలు పూర్తి కావడంతో ఈ భారీ సంకీర్తన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు వీధిలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో నితాయి, గౌరంగ ప్రతిమలను అందంగా అలంకరించి పల్లకి యాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ ప్రతినిధులు శ్రీ గోకులేష్ దాస ప్రభు, సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు శ్రీ విభిషణ్ దాస ప్రభు లు పూజ కార్యక్రమం నిర్వహించి పల్లకి యాత్రను ప్రారభించారు. జహీరాబాద్ మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ శిరీష సురేందర్ రెడ్డి దంపతులు పూజ కార్యక్రమం లో పాల్గొని గౌర నితాయి ఆశీస్సులు పొందారు. భక్తి రస పూర్వక కీర్తనలతో వందలాది మంది భక్తుల ఊరేగింపు తో ఈ కార్యక్రమం పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా సాగింది. స్వర్ణ కారుల వీధిలోని హనుమాన్ మందిరం, మెయిన్ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం, సుభాష్ గంజ్ మీదుగా రతన్ మెడికల్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అక్షయ పాత్ర ఫౌండేషన్ వైస్ చైర్మన్ శ్రీ హిజ్ గ్రేస్ యగ్నేశ్వర్ ప్రభుజీ ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర పద్మశాలి భవన్ కు చేరుకుంది సనాతన ధర్మాన్ని మరిస్తే అధోగతే కర్మ భూమి, వేదభూమి, ఋషి పుంగవులకు నిలయమైన భారత దేశంలో జన్మించి విషపు పోకడలపై మోజు పెంచుకోవడం మనిషి జీవన ప్రమాణాలను అధోగతిపలు చేస్తుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అక్షయ పాత్ర ఫౌండేషన్ వైస్ చైర్మన్ శ్రీ యగ్నేశ్వర్ దాస ప్రభుజీ ఆవేదన వెలిబుచ్చారు. పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఆదివారం రాత్రి 201 నగర సంకీర్తన నేపథ్యంలో జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ చేపట్టిన మహా హరినామ సంకీర్తన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, ఆధ్యాత్మికతతో కూడిన జీవనాన్ని గడపాలని సూచించారు. ఈ సందర్భంగా భగవద్గీత విశిష్టతను చాటి చెబుతూ ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలని, నిజజీవితంలో ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తున్న నగర సంకీర్తన కేవలం కొద్ది మంది భక్తులతో ప్రారంభమై ప్రస్తుతం ఎనిమిది వందల మందికి చేరుకోవడం ముదవహమని కితాబిచ్చారు. భగవంతుడి పట్ల ప్రేమను కలిగి ఉండి, నిర్మలమైన మనసుతో చేసే ఏ పనికైనా దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ క్రమంలోనే హరేకృష్ణ మూమెంట్ చిన్నారులు శ్రీశాంత్, అన్విత్, ఆర్చిత్, బస్వరాజ్, కార్తీక్, అమర్ అనే భక్తులు ‘పునర్ మూషికోభవ ‘ నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం నితాయి గౌరంగ లకు మంగళ హారతి, ఆశ్రయ్ కార్యక్రమం కింద శ్రద్ధావాన్ భక్తుల రిజిస్ట్రేషన్, మహా ప్రసాద వితరణ జరిగింది. దాదాపు వేయి నుండి పదిహేను వందల మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.