జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 6 సెల్ 9550978955
దేశవ్యాప్తంగా జగ్జీవన్ గారి విధానాలే వర్ధిల్లుతున్నాయి బాబు జగ్జీవన్ గారిని ఎక్కువగా ప్రజలు విశ్వసిస్తున్నారు
ఎస్సీ ఎస్టీ బీసీలు వారి జీవితాలను మార్చుకోవాలంటే, వ్యవస్థలో ఉంటూ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని వారు సూచించారు,
హిందూమతంలో ఉంటూ హిందూ మతంలో మార్పులు తీసుకురావాలని జగ్జీవన్ రావు గారు ఆనాడే చెప్పారు,
బ్రతుకు మార్చుకోవడం కోసం అన్యమతాలను ఆశ్రయించొద్దని, సమాజానికి సమాంతర మరో వ్యవస్థను నిర్మించాలని చూడొద్దని జగ్జీవన్ రావు గారు ఆనాడే చెప్పారు,వ్యవస్థనే పూర్తిగా మార్చాలి అనుకున్న ఏ ఒక్కరు నేడు విజయం సాధించలేదు,చివరకు వ్యవస్థను మార్చాలి అనుకున్న వారే కనుమరుగైపోతున్నారు,తాను నమ్మిన సిద్ధాంతాన్ని నిరూపించి చూపించాడు ఆయన… కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు చేపడుతూ.. రాజకీయాలలో ఉప ప్రధాని స్థాయి వరకు ఎదిగి, ఏ విధంగా బ్రతుకులు మార్చుకోవాలో ఆయన నిర్దేశించేశాడు,బ్రతకడం కోసం ఎవరి కాళ్ళకిందో బ్రతుకొద్దని, ఏంతటి వారినైనా ఎదిరించే స్థాయికి ఎదగాలి అనుకున్నాడు,కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు గాంధీ కుటుంబాన్ని ఎదిరించిన చరిత్ర ఏనాడు లేదు, ఎవరికి లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటూ ఇందిరాగాంధీకే ఎదురు తిరిగిన మొనగాడు బాబు జగ్జీవన్ గారు,హిందూమతంలో ఉన్న హెచ్చుతగ్గుల వ్యవస్థను నిర్మూలించడానికి మనం అదే మతంలో ఉండి దాని సంస్కరించాలి అని చెప్పారు అయన,కొందరు దళిత నాయకులు మనం విముక్తి చెందాలంటే హిందూ మతం వీడి ఇతర మతాల్లో చేరాలని అనేక ప్రసంగాలు చేశారు కానీ మెజారిటీ దళిత సమాజం నేడు హిందూ మతంలోనే ఉంది,జగ్జీవన్ గారి విధానం మీద అనేక అపోహలు, అబండలు వేసినటువంటి వర్గమే భాగ్యరెడ్డి వర్మ వారిని కొనియాడుతుంది, మరి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులుగా తెలుసుకోవాలని, మనం అందరం హిందువులమే అని పిలుపునిచ్చారు, ఆ వర్గం ఎందుకు భాగ్యరెడ్డి వర్మ గారిని విమర్శించలేదు సమాధానం చెప్పగలరా ఎవరిని కుయుక్తులు పడ్డ నేడు దళిత సామాజిక వర్గం హిందూమతంలోనే ఉంటూ.. మత సమానత్వం దిశగా సమాజం అడుగులు వేస్తుంది, అంటే సమాజం ఎవరి విధానాలను అనుసరిస్తుందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్రైస్తవులుగా మారిన దళితులకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తామన్నప్పుడు, హిందూమతంలో మార్పులు తీసుకురావాలని లేదా కుల వ్యవస్థను రద్దు చేయాలని దళిత నాయకులు మాట్లాడుతుండడం ఇప్పుడు మనం చూస్తున్నాం, పూజారితనం రద్దు కావాలని దళితుల్లో అన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, అంటే వీరు కూడా హిందూ మతంలో ఉంటూ మార్పు కోరుకుంటున్నారు అంటే వీరు కి బాబు జగ్జీవన్ రావు గారి ఆలోచన విధానం ఇప్పుడు అవసరమైందని గుర్తుతెరగాలి రాజకీయంగా బాబూజీ విధానాలు అనుసరించడం వల్లనే దళిత సామాజిక వర్గంలో పుట్టిన అనేకమంది గొప్ప స్థాయికి చేరుకున్నారు ఇందుకు ఉదాహరణ కె.ఆర్. నారాయణన్: కాంగ్రెస్ మద్దతుతో భారతదేశపు పదవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈయన దేశపు మొదటి దళిత రాష్ట్రపతి. సుశీల్ కుమార్ షిండే: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర హోం మంత్రిగా మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మల్లికార్జున ఖర్గే: ప్రస్తుత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షులు. ఈయన కేంద్ర మంత్రిగా, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పనిచేశారు.చరణ్‌జిత్ సింగ్ చన్నీ: పంజాబ్ రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారు.భోలా పాశ్వాన్ శాస్త్రి: బీహార్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.జగన్నాథ్ పహాడియా: రాజస్థాన్ తొలి దళిత ముఖ్యమంత్రి.తెలుగు రాష్ట్రాల నుండి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్):దామోదరం సంజీవయ్య: భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) మొదటి దళిత ముఖ్యమంత్రి. అలాగే, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడైన తొలి దళిత నేత కూడా ఈయనే.
జి. వెంకటస్వామి (కాకా): తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈయన కేంద్ర మంత్రిగా, ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు.కోనేరు రంగారావు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భూ సంస్కరణల విషయంలో ఈయన చేసిన కృషి చిరస్మరణీయం.మల్లు రవి: ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంపీగా మరియు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
భట్టి విక్రమార్క: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు.దామోదర రాజనర్సింహ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా ఉన్నారు.ఇదంత బాబూజీ ఆలోచన విదానం కాదు అనగలరా వ్యవస్థకు బయట ఉంటే వీరు ఈ గొప్ప స్థాయిని అందుకోగలరా వ్యవస్థకు సమాంతర వ్యవస్థను నిర్మించాలనుకున్న నక్సలిజం ఏమైంది??మతానికి సమాంతర మతాన్ని స్థాపించాలనుకున్న మతవాదం ఏమైంది?? ఇప్పటికైనా ఇప్పటికైనా బాబూజీ ఈ దేశ బడుగు బలహీన వర్గాలకు ఒక దిక్సూచి ఒక మార్గదర్శి ఆయన నిలిచి గెలిచి చూపించాడు కాబట్టి ఆయన మార్గం ఇప్పుడు మనకు ఎంతో అవసరం.చిరుగూరి నాగరాజు మాదిగ,MRPS నరసరావుపేట నియోజకవర్గం ఇన్చార్జి


