జనం న్యూస్ ఏప్రిల్ 6 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఉదయం గ్రామ సర్పంచ్ అంగన్వాడి సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు తదనంతరం పిల్లలను అడిగి తెలుసుకున్నారు రోజు గుడ్డు పాలు ఆహారం పెడుతున్నారా అని అడిగారు అలాగే పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు అలాగే పిల్లలకు పౌష్టికాహారం అందించాలని కోరారు పౌష్టికాహారం వల్ల పిల్లలు బలంగా దృఢత్వంగా ఉంటారు అలాగే టీచర్లను అడిగి పలు రిజిస్టర్ లను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు పుట్టిన చనిపోయిన వ్యక్తుల పేర్లు నమోదు చేయాలని వారికి తెలియజేశారు బాల్య వివాహాలు జరగకుండా చూడాలని సూచించారు ప్రతిరోజు పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని బాలామృతం అందించాలని సూచించారు బాలామృతం లో ఎన్నో విటమిన్లు ఉంటాయని తెలియజేశారు అంగన్వాడి పిల్లలకు మొట్టమొదటి విద్యా అంగన్వాడి నుండి ప్రారంభం అవుతుందని అందుకని పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు


