Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి,

బాబు జగ్జీవన్ రాయ్ 119జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యరు లో బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ అధ్యక్షతన మహనీయుని విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ముమ్మిడివరం వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రాయ్ గారు సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని, ఆయన ఆలోచనలు నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ మట్ట సూరిబాబు సీనియర్ నాయకులు సుంకర నాగేశ్వరరావు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.